Skip to main content

సైరా నరసింహా రెడ్డి


సహజంగా రాజుల కాలపు కథలు,జానపథాలు,వీర గాథలూ ప్రేక్షకులని అమితంగా ఆకట్టుకుంటాయి.సినిమా అనేది శబ్ధం దృశ్యం కలగలిపి కళ్ళకు కట్టినట్టు చూపడం.వీరుల కథలు సహజంగానే అమితమైన ఉద్వేగాన్ని  ఇస్తాయి.ఇవి దాదాపు ఒక సినిమా ఇవ్వగలిగినంత భావోద్వేగాన్ని ఇవ్వగలవు.సహజంగా రాజుల కాలపు కథలు రాజ్యంపై దృష్టి సారిస్తాయి.చివరకు రాజ్యం దక్కింది అనగానే హమ్మయ్య అన్న భావన కలిగిస్తాయి.సింహాసనాధిష్టానం గమ్యంగా సాగిన కథలు ఎక్కడైనా అనాసక్తి కలిగించిన దాఖలాలు ఉంటాయేమో గానీ,చారిత్రక నేపథ్యంలో విజయమో వీర స్వర్గమో అన్న రీతిగా సాగే కథలు ప్రపంచ వ్యాప్తంగా జానపద సాహిత్యంలో ఎంత వెతికినా మచ్చుకైనా ఒక్కటి కూడా దొరకదు.ఉయ్యాలవ్వాడ వారి చరిత్ర ఇట్టిదే.సినామాతో సంబంధం లేకుండానే ఆ కథలో ఎన్నో ఘట్టాలు ఆసక్తి కలిగించేవిగా ఉన్నాయి.అమితాబచ్చన్ ఇటువంటి పాత్రలు చేసినంత మాత్రాన సరిగ్గా ఆడకుండా పోయిన సినిమాలు లేవా అని అనొచ్చు.వీర రసం,శృంగార రసం,హాస్య రసం సహజంగా ఎటువంటి వారినైనా ఆకట్టుకునే శక్తి వాటికుంటుంది.వీర రసంలో ఉత్కంఠనీ,రక్తినీ కలిగించగలిగితే సినిమా పంట పండినట్టే. కేశాలంకరణ,వస్త్రధారణ, నోరు పెద్దగా చేసి అరవడం,ఇవన్నీ చిరంజీవని చూసే వాళ్ళకి చాలా కొత్తగా అనిపించాయి.
ఈ చిత్రానికొచ్చేసరికి ఇది ఎలా తీస్తారు?ఎంత వసూలు చేస్తుంది?అన్న రెండు ప్రశ్నలు జనాల్లో తెగ తిరుగుతున్నాయి.ఎంత చెత్త సినిమా అయినా,హాలు విడిచి వెళ్ళేటప్పుడు చిరంజీవిని చూసిన సంతృప్తి మిగిల్చి పంపడం చిరంజీవికి ఆనవాయితీ.ప్రతిభా పాఠవాలు కొందరికి ఎక్కువుంటాయి  తక్కువఉంటాయి. కృషీ,ప్రయత్నం,పట్టుదల ద్వారా ప్రయిక్షకులని కటయిపడేయడం కళాకారుడి లక్షణం.ఎవరెన్ని రకాలుగా విమర్శించినా,ఎవరే సినిమా హీరో అభిమాని అయినా,బైటకి ఎం మాట్లాడినా మనసులో చిరంజీవికి స్థానం ఇవ్వక తప్పదు.ఆ గౌరవం తెలుగు రాష్ట్రాల్లో ఒక్క చిరంజీవికే దక్కింది.అది కళాకారుడిగా తను ఎదిగిన విధానం.
మనం చిరంజీవి సినిమా చూడబోతున్నాం అన్నదే మనసులో ఒక పెద్ద ఆనందం,ఇక సినిమా ఎలా ఉంది అన్నది అసలు ప్రశ్నే కాదు.ఇదే తెలుగు హీరో రేపు దేశ వ్యాప్తంగా ఐదు భాషల్లో దుమ్ము లేపుతాడాని,ఆయా ట్రైలర్ల కింద సాక్షంగా చూసిన వారు వ్రాసి మరీ తెలిపారు.
ఒక భారీతనం ఉన్న సినిమా ఎక్కువ డబ్బులు చేసిందని,అసలు ఆడలేదనీ,కాబట్టి సైరా గురించి ఏమీ చెప్పలేము అని అనుకునేవాళ్ళకి టీజర్,ట్రైలర్ రెండింటిలో గుక్క తిప్పుకోనీయకుండా చూపాడు దర్శకుడు సురేందర్ రెడ్డి.కనిపించిన ప్రతీ నటీ,నటుల ముఖంలో 'రానున్న ఒక యుద్ధం' లేకపోలేదు.మేకింగ్ వీడియో,టీజర్,ట్రైలర్ ఈ మూడింటి ఆధారంగా చెప్పాలంటే ప్రపంచ వ్యాప్తంగా ప్రజాదరణ పోందుతుందనే చెప్పొచ్చు. అంత దమ్ముంది కథలో.భారీతనం,భారీ తారాగణం,ప్రాంతీయ నటులు,దేశంలోని ప్రధాన భాషల్లో విడుదలా..ఇవన్నీ సైరాకి బలం చేకూర్చాయి.ముఖ్యంగా తుఫానులా ఆవేశంగా ఉన్న చిరంజీవి.
స్వాతంత్ర వీరులు,వాళ్ళకి తప్పక చేశారు ప్రాణ త్యాగం అని తేలిగ్గా మాట్లాడే కుర్ర కారు ఉన్న సమయంలో పిల్లలూ,యువకులకూ... స్వేచ్ఛా,స్వాతంత్ర్యాల కోసం చేసే పోరాటాల ఔన్నత్యం,ప్రాణ త్యాగాల విలువను గుర్తు చేసేదిగా ఉంటుంది,ఈ తొట్ట తొలి స్వాతంత్ర్య సమర యోధుడి గాథ.అదే అదే...మన మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహా రెడ్డి సినిమా.సినీ అతి మేధావులూ,సినీ అతి విశ్లేషకుల సంగతేమో తెలియదు గానీ,దేశంలో ఏ ప్రాంతమైన సి క్లాస్ ప్రేక్షకులని ఉర్రూతలూగించడం మాత్రం ఖాయం......గస్తీ

Comments