సహజంగా రాజుల కాలపు కథలు,జానపథాలు,వీర గాథలూ ప్రేక్షకులని అమితంగా ఆకట్టుకుంటాయి.సినిమా అనేది శబ్ధం దృశ్యం కలగలిపి కళ్ళకు కట్టినట్టు చూపడం.వీరుల కథలు సహజంగానే అమితమైన ఉద్వేగాన్ని ఇస్తాయి.ఇవి దాదాపు ఒక సినిమా ఇవ్వగలిగినంత భావోద్వేగాన్ని ఇవ్వగలవు.సహజంగా రాజుల కాలపు కథలు రాజ్యంపై దృష్టి సారిస్తాయి.చివరకు రాజ్యం దక్కింది అనగానే హమ్మయ్య అన్న భావన కలిగిస్తాయి.సింహాసనాధిష్టానం గమ్యంగా సాగిన కథలు ఎక్కడైనా అనాసక్తి కలిగించిన దాఖలాలు ఉంటాయేమో గానీ,చారిత్రక నేపథ్యంలో విజయమో వీర స్వర్గమో అన్న రీతిగా సాగే కథలు ప్రపంచ వ్యాప్తంగా జానపద సాహిత్యంలో ఎంత వెతికినా మచ్చుకైనా ఒక్కటి కూడా దొరకదు.ఉయ్యాలవ్వాడ వారి చరిత్ర ఇట్టిదే.సినామాతో సంబంధం లేకుండానే ఆ కథలో ఎన్నో ఘట్టాలు ఆసక్తి కలిగించేవిగా ఉన్నాయి.అమితాబచ్చన్ ఇటువంటి పాత్రలు చేసినంత మాత్రాన సరిగ్గా ఆడకుండా పోయిన సినిమాలు లేవా అని అనొచ్చు.వీర రసం,శృంగార రసం,హాస్య రసం సహజంగా ఎటువంటి వారినైనా ఆకట్టుకునే శక్తి వాటికుంటుంది.వీర రసంలో ఉత్కంఠనీ,రక్తినీ కలిగించగలిగితే సినిమా పంట పండినట్టే. కేశాలంకరణ,వస్త్రధారణ, నోరు పెద్దగా చేసి అరవడం,ఇవన్నీ చిరంజ...